: కొత్త అవతారంలో జార్జి బుష్


అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జి హెచ్ డబ్ల్యూ బుష్ తన సౌహార్ద్రత చాటుకున్నారు. తన కార్యాలయంలోని సీక్రెట్ సర్వీస్ సభ్యుడి రెండేళ్ల కుమారుడు పాట్రిక్ లుకేమియాతో బాధపడుతున్నందుకు సానుభూతి తెలియజేస్తూ తాను సైతం గుండు చేయించుకున్నారు. పాట్రిక్ కు కీమోథెరపీ సందర్భంగా జుట్టు రాలిపోవడంతో తానూ క్లీన్ షేవ్ చేయించుకుని ఆ చిన్నారికి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా బాబుతో దిగిన ఫోటోలను తాజాగా బుష్ కార్యాలయ అధికారులు విడుదల చేశారు. పాట్రిక్ కు మద్దతు తెలిపేందుకే బుష్ ఇలా గుండు చేయించుకున్నారని తెలిపారు. 1989 నుంచి 93 వరకు అమెరికా అధ్యక్షుడిగా బుష్ పని చేశారు. 60 సంవత్సరాల కిందట ఆయన, భార్య బార్బారా లుకేమియా వ్యాధితో బాధపడుతున్న తమ నాలుగేళ్ల కుమార్తె రాబిన్ ను కోల్పోయారు. అటు బాబు వైద్య ఖర్చు సహాయం కోసం www.patrickspals.org వెబ్ సైట్ ను కూడా ప్రారంభించారు.

  • Loading...

More Telugu News