: ఆరేళ్ల బాలుడికి ఊబకాయ శస్త్రచికిత్స


భోపాల్ లో ఆరేళ్ల బాలుడికి ఉబకాయం నుంచి విముక్తి కల్పించేందుకు శస్త్రచికిత్స నిర్వహించారు. సహజంగా, అధిక బరువు ఉన్నవాళ్లు బేరియాట్రిక్ సర్జరీ చేయించుకుని బరువు తగ్గుతారు. మన సినీ హీరోలు కూడా ఇదే తరహా శస్త్రచికిత్స చేసుకుని బరువు తగ్గారని పలు కథనాలొచ్చిన సంగతి తెలిసిందే. అయితే, మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ఓ ఆరేళ్ల బాలుడికి ఇలాంటి శస్త్రచికిత్స చేశారు. ఆ బాలుడు కేవలం ఆరేళ్లకే 60 కేజీల బరువున్నాడు. అధిక బరువుతో ఆ బాలుడు ఊపిరి తీసుకోవడం, నిద్రపోవడం కూడా కష్టంగా మారింది. దీంతో, అతడికి ఈ శస్త్రచికిత్స తప్పలేదు. కాగా, దేశంలో ఈ సర్జరీ చేయించుకున్న అతిపిన్న వయస్కుడు ఈ బాలుడే కావడం విశేషం. ఆపరేషన్ తరువాత ఏడు కిలోల బరువు తగ్గాడని, రానున్న 6 నెలల్లో ఈ బాలుడు మరో 30 కిలోలు తగ్గుతాడని సర్జరీ చేసిన డాక్టర్లు అన్నారు.

  • Loading...

More Telugu News