: సమైక్యాంధ్ర కోసం కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజీనామా


సమైక్య రాష్ట్రానికి మద్దతుగా కడప జిల్లా కమలాపురం కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరశివారెడ్డి రాజీనామా చేశారు. ఎమ్మెల్యే పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. రాజీనామా లేఖలను అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ తో పాటు పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణకు పంపుతున్నట్లు తెలిపారు. రాష్ట్రం సమైక్యంగా, సుభిక్షంగా ఉండాలనే తను రాజీనామా చేసినట్లు శివారెడ్డి వెల్లడించారు. రాష్ట్ర విభజన విషయంలో ఏమైనా విభిన్న నిర్ణయాలు వెలువడితే, పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వీరశివారెడ్డి హెచ్చరించినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News