: 57 పరుగులకే ఓపెనర్లు అవుట్
జింబాబ్వేతో తొలి వన్డేలో భారత జట్టుకు ఆశించిన శుభారంభం దక్కలేదు. హరారేలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో ఆతిథ్య జట్టు విసిరిన 229 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 57 పరుగులకే ఓపెనర్లిద్దరినీ కోల్పోయింది. 17 పరుగులు చేసిన శిఖర్ ధావన్.. జార్విస్ కు వికెట్ అప్పగించగా.. 20 పరుగులు చేసిన రోహిత్ శర్మ.. చిగుంబుర బౌలింగ్ లో వెనుదిరిగాడు. ప్రస్తుతం టీమిండియా 18 ఓవర్లలో 2 రెండు వికెట్లకు 81 పరుగులు చేసింది. క్రీజులో కెప్టెన్ కోహ్లీ (32 బ్యాటింగ్), రాయుడు (7 బ్యాటింగ్) ఉన్నారు. విజయానికి భారత్ ఇంకా 32 ఓవర్లలో 148 పరుగులు చేయాల్సి ఉంది.