: భారత్ ముంగిట ఈజీ టార్గెట్


తొలివన్డేలో జింబాబ్వే.. భారత్ ముంగిట సులభసాధ్యమైన లక్ష్యం ఉంచింది. హరారేలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన జింబాబ్వే జట్టును భారత బౌలర్లు ఓ మోస్తరు స్కోరుకే కట్టడి చేశారు. దీంతో, నిర్ణీత 50 ఓవర్లు ముగిసేసరికి ఆతిథ్య జట్టు 7 వికెట్లకు 228 పరుగులు చేసింది. ఆ జట్టులో ఓపెనర్ సికిందర్ రజా 82 పరుగులు చేశాడు. ఆల్ రౌండర్ ఎల్టన్ చిగుంబురా 43 పరుగులతో నాటౌట్ గా మిగిలాడు. ఇక భారత బౌలర్లలో లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా 3 వికెట్లు తీయగా, రైనా, వినయ్ కుమార్, షమి, ఉనద్కట్ తలో వికెట్ తీశారు.

  • Loading...

More Telugu News