: 'భాగ్ మిల్కా భాగ్' పై ఢిల్లీ సర్కారు ప్రేమ


పరుగుల వీరుడు, 'ఫ్లయింగ్ సిఖ్' బిరుదాంకితుడు మిల్కా సింగ్ జీవనపోరాటం ఇతివృత్తంగా తెరకెక్కిన 'భాగ్ మిల్కా భాగ్' చిత్రానికి పన్ను మినహాయింపు ఇచ్చిన రాష్ట్రాల జాబితాలో ఢిల్లీ కూడా చేరింది. రాకేష్ ఓం ప్రకాశ్ మెహ్రా దర్శకత్వం వహించిన ఈ స్ఫూర్తిదాయక చిత్రానికి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు ఇప్పటికే పన్ను మినహాయింపు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాయి. తాజాగా ఢిల్లీ సీఎం షీలా దీక్షిత్ కూడా ఈ సినిమాకు తమ రాష్ట్రంలో పన్ను మినహాయింపు తక్షణమే వర్తిస్తుందని ప్రకటించారు. ఈ విషయమై దర్శకుడు రాకేష్ మెహ్రా స్పందిస్తూ.. మిల్కాపై సినిమాకు ఇన్ని రాష్ట్రాల నుంచి సానుకూల స్పందన రావడం నిజంగా సంతోషదాయకం అని పేర్కొన్నాడు.

  • Loading...

More Telugu News