: మీ కంప్యూటర్లు జర భద్రం


మీరు కంప్యూటర్‌ వాడుతున్నారా... అయితే మీ కంప్యూటర్లను కాస్త జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే ఒక కొత్తరకం వైరస్‌ కంప్యూటర్‌లలోకి ప్రవేశించి మీ సిస్టమ్‌లోని సమాచారాన్ని దొంగిలించేస్తుందట. ఈ మేరకు కంప్యూటర్‌ ప్రతిస్పందన బృందం (సెర్చ్‌) హెచ్చరిస్తోంది.

మన దేశంలోకి ఒక కొత్తరకం వైరస్‌ ప్రవేశించినట్టు కంప్యూటర్‌ అత్యవసర ప్రతిస్పందన బృందం గుర్తించింది. 'బీబోస్‌' అనే ఈ కొత్త వైరస్‌ టోర్జాస్‌ మాల్‌వేర్‌ రకానికి చెందినది. ఈ వైరస్‌ మన కంప్యూటర్‌లోని సమాచారాన్ని తస్కరించేయడమే కాకుండా మన కంప్యూటర్‌ను నాశనం చేసేస్తుందని సెర్చ్‌ హెచ్చరిస్తోంది. ఈ వైరస్‌ పట్ల దేశంలోని కంప్యూటర్‌ వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని సెర్చ్‌ హెచ్చరిస్తోంది.

  • Loading...

More Telugu News