: 'జింబాబ్వే'ను ఆడుకొంటాం: కోహ్లీ ధీమా
జింబాబ్వే టూర్ రేపటి నుంచి మొదలవనుండగా, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించాడు. బలహీన జింబాబ్వే జట్టును ఓ ఆట ఆడుకొంటామని చెప్పాడు. సీనియర్లు లేకపోయినా, చింతించాల్సిన పనిలేదన్నాడు. జట్టులో యువరక్తం పొంగిపొర్లుతోందంటూ.. తాజా పర్యటనను సరదాగా ముగించేస్తామని అన్నాడు. ఏమంత మెరుగైన ప్రదర్శన కనబరచని జింబాబ్వేతో పోరును సీరియస్ గా తీసుకోవాల్సి అవసరం లేదని కోహ్లీ చెప్పుకొచ్చాడు. కాగా, ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా రేపు హరారే స్పోర్ట్స్ క్లబ్ లో తొలి వన్డే జరగనుంది.