: కేంద్రం పరిధిలోకి హోం, రెవెన్యూ శాఖలు తేవడం రాజ్యాంగ విరుద్ధం: వినోద్
హోం, రెవెన్యూ శాఖలను కేంద్రం పరిధిలోకి చేర్చి తెలంగాణ ఏర్పాటు చేస్తారన్న వాదన రాజ్యాంగ విరుద్ధమని టీఆర్ఎస్ సీనియర్ నేత బి వినోద్ కుమార్ స్పష్టం చేశారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ, పాలన శాఖలు ఎవరి పరిధిలో ఉండాలన్న విషయం రాజ్యాంగంలో స్పష్టంగా వివరించారని, వాటికి విరుద్ధంగా వ్యవహరిస్తే సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలుగుతుందన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యేంత వరకూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాయలసీమ విభజనను టీఆర్ఎస్ కోరుకోవడం లేదని ఆయన అన్నారు. రాష్ట్రవిభజన అంశాన్ని సాగదీసేందుకు కాంగ్రెస్ యత్నిస్తోందని ఆయన ఆరోపించారు.