: 'తెలుగుదేశం' ప్రభంజనం
తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు దూసుకెళుతున్నారు. ఈ రోజు మధ్యాహ్నానికి పోలింగ్ ముగియగా.. ప్రస్తుతం ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. సర్పంచి పదవులకు గాను ఇప్పటివరకు 1329 మంది టీడీపీ మద్దతుదారులు జయభేరి మోగించగా.. కాంగ్రెస్ కు 1153, వైఎస్సార్సీపీకి 864, టీఆర్ఎస్ కు 256, వామపక్షాలకు 35, ఇతరులకు 734 పంచాయతీలు దక్కాయి. ఇంకా 2195 పంచాయతీలకు ఫలితాలు వెల్లడించాల్సి ఉంది.