: దేశంలో టెర్రరిజానికి అద్వానీయే కారణం: దిగ్విజయ్
కాంగ్రెస్, బీజేపీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. దేశంలో టెర్రరిజం, మతతత్వం పెచ్చుమీరడానికి ఎల్ కే అద్వానీ 1980లో నిర్వహించిన రథయాత్రే కారణమని ఏఐసీసీ నేత దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యానించారు. దానివల్లే భారతదేశంలో మతతత్వ రాజకీయం, ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగాయన్నారు. అయితే, 'ఇండియన్ ముజాహిద్దీన్' వ్యాఖ్యలపై తానేమి తప్పించుకోవడం లేదన్నారు. దాని గురించి మీడియాకే బాగా తెలుసునన్నారు. ఒక మతం వల్లే ఉగ్రవాదం ఉద్భవించిందని ప్రపంచం మొత్తం నమ్మాలని బీజేపీ కోరుకుంటోందని, ఇది దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు.