: గాలిపటం ఎగరేద్దాం రమ్మంటూ బాలికపై అత్యాచారం
ఓ కామాంధుడి దురాగతానికి ఆరేళ్ళపాల బలైపోయిన ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. నిందితుడు ఓ కానిస్టేబుల్ కుమారుడన్న వాస్తవం నివ్వెరపరుస్తోంది. వివరాల్లోకెళితే.. బాధిత బాలిక కుటుంబం సదరు కానిస్టేబుల్ ఇంట్లో అద్దెకుంటోంది. ఆ ఇంటి యజమానికి 14 ఏళ్ళ కుమారుడున్నాడు. ఒకటవ తరగతి చదివే బాలిక ఓ రోజు ఇంటివద్దనే ఒంటరిగా ఉండడం గమనించిన ఈ టీనేజ్ కుర్రాడు.. గాలిపటం ఎగరేద్దాం రమ్మంటూ ఆ పాపను మేడపైకి తీసుకెళ్ళి అత్యాచారం చేశాడు. ఆ బాలిక తల్లి మార్కెట్ నుంచి తిరిగొచ్చేసరికి రక్తస్రావంతో విలవిల్లాడుతున్న కుమార్తె కనిపించింది. దీంతో, విషయాన్ని తన భర్తకు వివరించడంతో అతడు స్థానిక విజయ్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వైద్య పరీక్షల కోసం పాపను ఆసుపత్రికి తరలించి, దర్యాప్తు షురూ చేశారు.