: బ్రిటన్ రాయల్ కుటుంబానికి ఒబామా శుభాకాంక్షలు


బ్రిటన్ యువరాజు ప్రిన్స్ విలియమ్, కేట్ మిడిల్ టన్ లకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, సతీమణి మిచెల్లీ ఒబామా శుభాకాంక్షలు తెలిపారు. రాయల్ కుటుంబంలోకి మూడవతరం వారసుడు ప్రవేశించిన సందర్భంగా తమ విషెస్ పంపారు. ఈ సమయంలో రాయల్ కుటుంబం, బ్రిటన్ ప్రజలు మరింత సంతోషంతో గడపాలని కోరుకుంటున్నట్లు ఓ సందేశంలో పేర్కొన్నారు. వారిద్దరికీ తమ అభినందనలు, దీవెనలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. భారత కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారుజామున 4.24 గంటలకు కేట్ మగబిడ్డకు జన్మనిచ్చింది.

  • Loading...

More Telugu News