: లగేజీ పోయినందుకు రైలు ప్రయాణికురాలికి 2లక్షల పరిహారం
'ఎవరి లగేజీకి వారే బాధ్యులు. పోతే మాకు సంబంధం లేదు' మనం ఎక్కడకు వెళ్లినా దాదాపుగా ఈ బోర్డు కనిపిస్తుంటుంది. రైల్వే స్టేషన్, బస్సు స్టేషన్, హాస్పిటల్, రెస్టారెంట్ ఇలా ఎక్కడైనా ఇదే వ్యవహారం. కానీ, బోర్డు తగిలించుకున్నంత మాత్రాన బాధ్యత తీరిపోదు. వినియోగదారుల వస్తువులకు తగిన భద్రత కల్పించాల్సిన పూచీ వారిపై తప్పకుండా ఉంటుందని గుర్తుచేస్తూ, ఢిల్లీలోని జాతీయ వినియోగదారుల ఫోరం ఒక కేసులో తీర్పు చెప్పింది. 1996లో ఒక మహిళా డాక్టర్ ఉత్తరప్రదేశ్ లో కుషీ నగర్ ఎక్స్ ప్రెస్ లో ప్రయాణిస్తుండగా.. ఆమె బ్యాగులను ఎవరో ఎత్తుకుపోయారు. దీనిపై ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. దీంతో ఆమె వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించారు. కేసును విచారించిన జాతీయ వినియోగదారుల ఫోరం సదరు మహిళా డాక్టర్ కు 2 లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని రైల్వే శాఖను ఆదేశించింది.