: బాధితులను ఆదుకోవాలి: చంద్రబాబు
మౌలాలి ఎంజే కాలనీలో గోడ కూలిన ఘటనలో మృతుల కుటుంబాలకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధితులను అదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ఘటనలో ఆరుగురు మరణించిన సంగతి తెలిసిందే. కాగా, బాధితుల కుటుంబాలను 'ఆపద్బంధు' పథకం ద్వారా ఆదుకుంటామని మంత్రి రఘువీరారెడ్డి తెలిపారు.