: చెరువులోకి దూసుకెళ్లిన బస్సు.. 8 మంది మృతి


కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్సు ఒకటి అదుపుతప్పి చెరువులోకి దూసుకుపోవడంతో 8 మంది మృతి చెందారు. హసన్ జిల్లా బేలూరు సమీపంలోని 'విష్ణు సముద్ర' చెరువు వద్ద ఈ ప్రమాదం జరిగింది. వెంటనే సహాయక కార్యక్రమాలు చేపట్టిన అధికారులు 35 మందిని ప్రాణాలతో రక్షించారు. ఎనిమిది మృతదేహాలను వెలికితీశారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 50 నుంచి 60 మంది వరకూ ప్రయాణికులు ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. మిగతా వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

  • Loading...

More Telugu News