: మనీషా కోయిరాలాకు బట్టతలే ముద్దు!
ఒకప్పుడు టాలీవుడ్, బాలీవుడ్ లో మంచి కథానాయికగా వెలుగొందిన మనీషా కోయిరాలా పెళ్లి అనంతరం సమస్యల్లోకి వెళ్లిపోయింది. భర్తతో విబేధాలు.. అనంతరం ఓవేరియన్ కేన్సర్. చికిత్స కోసం నెలల తరబడి న్యూయార్క్ లో మకాం వేసిన మనీషా ఇటీవలే ముంబైకి తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే. కేన్సర్ చికిత్స వల్ల మనీషా విలువైన కురులను కోల్పోవాల్సి వచ్చింది. బట్టతలతో చూడ్డానికి బామ్మలా దర్శనమిస్తున్న మనీషా.. తన తాజా ఫొటోలను ఫేస్ బుక్ లో పెట్టేసింది. ఒకప్పుడు అందాల బొమ్మలా అభిమానులను అలరించిన ఈ నేపాలీ.. తాజాగా బట్టతలతో చూస్తే.. 'పాపం మనీషా కోయిరాలా' అనిపించకమానదు.