: జమ్మూకాశ్మీర్ ఎన్ కౌంటర్లో జైషే మహ్మద్ ఉగ్రవాది మృతి


జమ్మూకాశ్మీర్ లోని కుప్వారా జిల్లాలో జరిగిన భద్రతాదళాల ఎన్ కౌంటర్ లో 'జైషే మహ్మద్' ఉగ్రవాది ఖ్వారి యాసిర్ మృతి చెందాడు. ఇక్కడి గరెవాడ్ గ్రామంలోని లొలాబ్ ప్రాంతంలో ఈ తెల్లవారుజామున పోలీసులు, సైన్యం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ సమయంలో యాసిర్ కంటబడటంతో కాల్చి చంపారు. పాకిస్థానీ జాతీయుడైన అతను ఆరు సంవత్సరాల నుంచి ఇక్కడి ఉగ్రవాద కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటున్నాడు. అతని నుంచి ఏకె-47 రైఫిల్, మూడు పత్రికలు, రెండు గ్రెనేడ్లను స్వాధీనం చేసుకున్నారు.

  • Loading...

More Telugu News