: పెరిగిన మృతుల సంఖ్య.. లక్ష రూపాయల పరిహారం
హైదరాబాదులోని మౌలాలీలో గోడ కూలిన ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 6కు చేరింది. మరో మృతదేహాన్ని శిథిలాల కింద నుంచి వెలికితీశారు. మరోవైపు, ఘటనా స్థలాన్ని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ కృష్ణబాబు సందర్శించారు. అక్కడ జరుగుతున్న సహాయక కార్యక్రమాలను పర్యవేక్షించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మృతుల కుటుంబాలకు లక్ష రూపాయల వంతున పరిహారం చెల్లిస్తామని ప్రకటించారు. గోడ కూలిన ఘటనకు కారణమైన బిల్డర్ పై కేసు నమోదు చేస్తామని ఆయన చెప్పారు.