: మహిళా ట్రైనీ కానిస్టేబుల్ ఫై అత్యాచారయత్నం
కడప జిల్లా కమలాపురానికి ఎన్నికల విధుల కోసం వచ్చిన మహిళా ట్రైనీ కానిస్టేబుల్ ఫై ఓ కానిస్టేబుల్ అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. వివరాల్లోకెళితే.. హైదరాబాద్ లో శిక్షణ లో ఉన్న మహిళా కానిస్టేబుల్ కు కమలాపురం లోని సరస్వతి కళాశాలలో ఎన్నికల విధులు కేటాయించారు. దీంతో కళాశాల పక్కనే ఉన్న ఇంట్లో ఆమెకు వసతి కల్పించారు. ఎన్నికల విధుల కోసమే వచ్చిన సదరు కానిస్టేబుల్ ఆ ఇంట్లోకి ఆమెను పిలిపించుకొని అసభ్యంగా ప్రవర్తించి అత్యాచారయత్నం చేశాడు. దీంతో బాధితురాలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిఫై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం.