: ప్రిన్స్ విలియం దంపతులకు మగబిడ్డ


ప్రిన్స్ విలియం దంపతులకు మగబిడ్డ జన్మించాడు. బ్రిటన్ కాలమానం ప్రకారం సోమవారం సాయంత్రం 4.24గంటలకు విలియం భార్య కేట్ మిడిల్ టన్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. లండన్ లోని సెయింట్ మేరీ ఆసుపత్రిలో సోమవారం ప్రసవం కోసం ఆమెను చేర్పించిన సంగతి తెలిసిందే. ఆమె వెంట ప్రిన్స్ విలియం కూడా ఉన్నారు. కాగా.. విలియం, కేట్ మిడిల్ టన్ లకు జన్మించిన బిడ్డ బ్రిటన్ సింహాసనానికి మూడోతరం వారసుడవుతాడు.

  • Loading...

More Telugu News