: కేరళ ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి: ఏచూరి
కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ తనపై వస్తున్న ఆరోపణలకు బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని సీపీఐ కేంద్ర పొలిట్ బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూరి డిమాండ్ చేశారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. సోలార్ ప్యానళ్ల కుంభకోణంలో చాందీ అనుమతితోనే అతని కార్యాలయాధికారులు అవకతవకలకు పాల్పడ్డారని అభియోగాలు ఎదుర్కొంటున్నారు. మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రభుత్వం నిర్వహించకుండా ఉన్నంతకాలం బీహార్ లాంటి ఘటనలు చోటు చేసుకుంటూనే ఉంటాయన్నారు. ఎన్నో పోరాటాలు చేస్తే కానీ మధ్యాహ్న భోజన పథకం అమలుకు నోచుకోలేదని, దాన్ని అవకతవకలతో వృథా చేయొద్దని ఏచూరి అధికారులకు విజ్ఞప్తి చేశారు.