: అధికారులను అడ్డుకున్న వరద బాధితులు
ఖమ్మం జిల్లాలో వరద బాధితులు అధికారులను అడ్డుకున్నారు. జిల్లాలోని కూనవరంలో ముంపు ప్రాంతాల పరిశీలనకు సబ్ కలెక్టర్, ఐటీడీఏ పీవోలు వెళ్లారు. పర్యటన సందర్భంగా, వీరు కొన్ని ప్రాంతాలను మాత్రమే పరిశీలిస్తున్నారని, మిగిలినవి ఎవరు పరిశీలిస్తారని ప్రశ్నిస్తూ బాధితులు అధికారులను అడ్డుకున్నారు. వరదలు ఎప్పుడు వచ్చినా కొన్ని ప్రాంతాల ప్రజలు మాత్రమే పరిహారానికి అర్హులుగా నిలుస్తున్నారని, మిగిలినవారు వరద బాధితులు కాదా? అని వీరు ప్రశ్నిస్తున్నారు. దీంతో అధికారులు మిగిలిన ప్రాంతాలను కూడా పరిశీలించారు.