: సుష్మా స్వరాజ్ కు తప్పిన ముప్పు
బీజేపీ సీనియర్ నేత, లోక్ సభలో ప్రతిపక్ష నేత సుష్మాస్వరాజ్ ప్రయాణిస్తున్న విమానం సాంకేతిక సమస్య కారణంగా జైపూర్ లో హఠాత్తుగా దిగింది. ఈ ఉదయం సుష్మ ఢిల్లీ విమానాశ్రయం నుంచి ఉజ్జయిని బయలుదేరారు. విమానం ఇంజిన్ లో లోపం తలెత్తడంతో ఫైలెట్ జైపూర్లో దింపాడు. ఈ విషయాన్ని సుష్మ స్వయంగా తన ట్విట్టర్ లో తెలిపారు. అయితే, మరో విమానంలో ఇండోర్ వెళ్లి అక్కడినుంచి ఉజ్జయిని వెళుతున్నట్టు తెలిపారు. మధ్యప్రదేశ్ లో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో పార్టీ ప్రచారం చేపట్టింది. ఇందులో భాగంగా పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆమె అక్కడికి వెళ్లారు.