: పుజారా 'సిక్స'ర్


ఐసీసీ తాజాగా ప్రకటించిన టెస్టు ర్యాకింగ్స్ లో టీమిండియా యువ బ్యాట్స్ మన్ ఛటేశ్వర్ పుజారా టాప్ టెన్ కి ఎగబాకాడు. బ్యాట్స్ మెన్ జాబితా తొలి 20 మందిలో నిలిచిన భారత ఆటగాడు పుజారా ఒక్కడే. గతకొంతకాలంగా టెస్టుల్లో సెంచరీల మోత మోగిస్తున్న ఈ సౌరాష్ట్ర యువకెరటం తాజా ర్యాంకుల్లో 6వ స్థానానికి చేరుకోవడం విశేషం. ఇక బౌలర్ల ర్యాంకుల్లో హైదరాబాదీ లెఫ్టార్మ్ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా ఓ స్థానం మెరుగుపరుచుకుని 10వ ర్యాంకులో నిలిచాడు. కాగా, బ్యాటింగ్ ర్యాంకుల్లో దక్షిణాఫ్రికా ఓపెనర్ హషీమ్ ఆమ్లా, బౌలింగ్ ర్యాంకుల్లో ఆ దేశానికే చెందిన డేల్ స్టెయిన్ అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.

  • Loading...

More Telugu News