: మోడీని ప్రధానిగా అంగీకరించలేను: అమర్త్యసేన్


నోబెల్ విజేత, ప్రఖ్యాత ఆర్ధికవేత్త అమర్త్యసేన్ భారత రాజకీయాలపై తన అభిప్రాయాలను కుండబద్ధలు కొట్టారు. నరేంద్రమోడీని ప్రధానిగా అంగీకరించలేనన్నారు. సీఎన్ఎన్-ఐబీఎన్ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమర్త్యసేన్ ఈ వ్యాఖ్యలు చేశారు. 'మోడీ నా ప్రధాని కావాలని ఓ భారతీయ పౌరుడిగా అస్సలు కోరుకోను. మైనారిటీల కోసం ఆయనేం చేశాడు? వారి భద్రత కోసం మోడీ చేపట్టిన చర్యలు శూన్యం' అని పేర్కొన్నారు. ఇక గుజరాత్ లో మోడీ అనుసరిస్తున్న పాలన విధానాన్ని కూడా ఈ ఆర్ధికరంగ నిపుణుడు తప్పుబట్టారు. మోడీ తరహా పాలనకు అందరి ఆమోదం లభిస్తుందని భావించలేమన్నారు.

అమర్త్యసేన్ ప్రతిపాదించిన విప్లవాత్మక ఆర్ధిక సిద్ధాంతాలకు గుర్తింపుగా 1998లో ప్రతిష్ఠాత్మక నోబెల్ ప్రైజ్ వరించింది. ఆ తర్వాతి ఏడాదే దేశ అత్యున్నత పౌర పురస్కారం 'భారతరత్న' కూడా అమర్త్యసేన్ కీర్తికిరీటంలో చేరింది.

  • Loading...

More Telugu News