: కోనసీమ జిల్లాలకు కూర'గాయాలు'
తూర్పుగోదావరి జిల్లా ఐ పోలవరం మండలంలో వరద కారణంగా తీవ్ర సమస్యే వచ్చిపడింది. కూరగాయల తోటలకు కోనసీమ ప్రసిద్ధి. ఇక్కడ పండించే దొండ, బెండ, వంగ, ములగ, ఆకు కూరలు జిల్లాతో పాటు పశ్చిమ గోదావరి, విశాఖలకు ఎగుమతి చేస్తుంటారు. ఇక్కడ కేవలం కూరగాయలతో నిత్యం 50 లక్షల రూపాయల వ్యాపారం జరుగుతుంటుంది. తాజా గోదావరి వరదలతో ఐదు మండలాల్లోని 15 వేల ఎకరాల పంట పొలాలు నీటమునిగాయి. దీంతో ఈ జిల్లాలకు కూరగాయల సరఫరా తగ్గి వాటి ధరలు మండిపోతున్నాయి.