: చనిపోయిందనుకున్న భార్య.. ప్రియుడి పక్కనుండి ఫోన్ చేస్తే?


చనిపోయిందనుకున్న భార్య బతికుందని తెలిస్తే.. ఆమే స్వయంగా ఫోన్ చేసి మాట్లాడితే..? ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుందా? ఆగండాగండి.. దానికంటే ముందు తెలుసుకోవాల్సిన మరో విషయం ఉంది. తమిళనాడులోని వెల్లూరు పట్టణం.. కెవరిపక్కం పోలీస్ స్టేషన్. '28 ఏళ్ల నా భార్య గంగాదేవి తప్పిపోయిందండీ' అంటూ శరవణన్ అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ జూలై 13న ఫిర్యాదు చేశాడు. రోజులు గడుస్తున్నాయి.. పోలీసుల నుంచి ఎలాంటి కబురూ రాలేదు. ఇక భార్య చనిపోయి ఉంటుందనే భావించాడు శరవణన్. కొన్ని రోజుల తర్వాత 'కుళ్లిపోయి గుర్తుపట్టలేని స్థితిలో ఉన్న యువతి మృతదేహం ఒకటి ఇక్కడ ఉంది వచ్చి చూసి వెళ్లండి' అంటూ స్టేషన్ నుంచి కబురు. శరవణన్ తన కుటుంబ సభ్యులు, బంధువులను వెంటబెట్టుకుని పరుగున పోయి చూశాడు. కానీ గుర్తించలేని స్థితి. అయినా, 'అచ్చం మన గంగాదేవిలానే ఉందిరా' అంటూ పక్కనున్నవారు అంటుంటే, ఇక అంతా అయిపోయిందనుకున్నారు. ఇదే వార్తను అసలైన గంగాదేవి కోయంబత్తూరులోని ఒక హోటల్లో ప్రియుడి పక్కనే ఉండి టీవీలో చూసింది.

వెంటనే ఫోన్ తీసుకుని తన సోదరుడు సుగుమారన్ కు ఫోన్ చేసింది. 'అరే అన్నయ్యా.. నేనురా గంగాదేవిని. నేను చావలేదురా. నిక్షేపంలా ఉన్నా.. కానీ..కానీ.. కార్తీక్(తన తల్లిదండ్రుల ఇంటి పక్కనుండే కుర్రాడు)తో కలిసి కోయంబత్తూరు వచ్చారా. తనంటే నాకెంతో ఇష్టం. చెప్పకుండా వచ్చి తప్పు చేశాను క్షమించరా. మళ్లీ మెట్టినింటికి వెళితే నా ప్రేమ వ్యవహారం బయటపడుతుందని భయంతో వెళ్లలేదు' అని చెప్పింది. ఈ విషయాన్ని సుగురామన్ స్టేషన్ ఆఫీసర్ కు తెలియజేశాడు. పోలీసులు గంగాదేవిని వెల్లూరుకు తీసుకొచ్చారు. విచారణ అనంతరం.. అయితే మెట్టినిల్లు, కాదంటే పుట్టినింటి వారికి అప్పగిస్తామని వారు తెలిపారు.

  • Loading...

More Telugu News