: నేరం చేయకున్నా ఆ జైలులో శిక్ష అనుభవించవచ్చు!


తప్పు చేస్తేనే జైల్లో వేస్తారు. తప్పు చేయకుండా 'ప్లీజ్ ప్లీజ్ ఒక్కరోజు జైలులో ఉండి వెళ్లిపోతా.. బాబ్బాబు' అని బతిమాలినా లాఠీతో నాలుగు తగిలించి పంపిస్తారే తప్ప జైల్లోకి అడుగుపెట్టనీయరు. కానీ, జైల్లో జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో చూడాలని కొందరికి ఉబలాటం. అలాంటి వారు లాత్వియాలోని లైపజాలో ఉన్న కరోస్టా జైలుకు వెళ్లాల్సిందే. పర్యాటకులు కోరుకుంటే ఇక్కడి జైలులో ఉండడానికి అనుమతిస్తారు. కానీ ఇందుకు జైలు షరతులు, నిబంధనలకు కట్టుబడి ఉంటామంటూ ఒక పత్రంపై సంతకం చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే లోపల అచ్చంగా వారిని ఖైదీల్లానే చూస్తారు. పర్యాటకులు కదాని పూలల్లో పెట్టుకుని చూడరు. నిబంధనలు ఉల్లంఘిస్తే శిక్ష కూడా వేస్తారు. అచ్చమైన జైలు కూడే పెడతారు. 'హమ్మయ్య నా జైలు జీవితానికి విముక్తి కలిగిందిరా బాబు' అన్న అనుభూతిని అందిస్తారు. కావాలంటే వెళ్లి చూసిరండి!

  • Loading...

More Telugu News