: బాలీవుడ్ నటుడు మనోజ్ కుమార్ కు అస్వస్థత


బాలీవుడ్ సీనియర్ నటుడు మనోజ్ కుమార్ ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో అత్యవసరంగా చేరారు. గాల్ బ్లాడర్ (పిత్తాశయం)లో నొప్పి రావడంతో ఆసుపత్రిలో చేరినట్లు సన్నిహితులు తెలిపారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి మెరుగుపడిందని, రెండు రోజుల్లో ఇంటికి పంపిస్తారని చెప్పారు. నటుడిగా, దర్శకుడిగా మనోజ్ కుమార్ అందరికీ సుపరిచితులు. దేశభక్తి ప్రాధాన్య పాత్రలలో హీరోగా నటించి మెప్పించారు. 1992లో పద్మశ్రీ అవార్డును కూడా అందుకున్నారు.

  • Loading...

More Telugu News