: మనసుకు ప్రశాంతత లేకుంటే ఇంతే పాపం
ఆ తల్లి మనసుకు కుటుంబ సమస్యలు, ఇతర సమస్యలు ప్రశాంతత లేకుండా చేశాయి. దీంతో కన్న బిడ్డను కూడా మరచిపోయింది. ఫలితంగా ఆ బిడ్డ ప్రాణాలు కోల్పోయింది. వ్యాపారంలోని చికాకులు, ఆప్తుల అనారోగ్యం వంటి సమస్యలతో సతమతమవుతున్న ఒక తల్లి కారు వెనుక సీట్లో కన్నబిడ్డ ఉన్న సంగతి కూడా మరచిపోయి తాళం వేసి వెళ్లడంతో ఆ బిడ్డ ఊపిరాడక మరణించింది.
అమెరికాలోని అలాబామాలోని హోంవుడ్‌కు చెందిన కేటీ లూంగ్‌కు వ్యాపారంలోని చికాకులు, ఆప్తుల అనారోగ్యం వంటి సమస్యలతో సతమతమవుతూ కారు వెనుక సీట్లో తన 11 నెలల కన్న బిడ్డ ఉన్న సంగతి మరచిపోయింది. కారు తాళం వేసి వెళ్లిపోయింది. అయితే పాపను ఇంకా తీసుకురాలేదేమని పాప సంరక్షకురాలు ఫోన్ చేసి అడగడంతో ఒక్కసారిగా కన్నబిడ్డను కారులో వదిలేసిన విషయం గుర్తుకొచ్చింది. వెంటనే కారు దగ్గరికి వెళ్లి చూసేసరికి ఆ పసిబిడ్డ మృతిచెంది వుంది. కారులోని విపరీతమైన వేడికి ఆ పసిబిడ్ద అచేతనురాలై కారులోనే ప్రాణాలు కోల్పోయింది. తన కన్నబిడ్డ చావుకు తనే కారణం కావడంతో కేటీ ఆవేదన వర్ణనాతీతంగా ఉంది.