: బెల్జియం కొత్త రాజు ఫిలిప్
బెల్జియం రాజుగా యువరాజు ఫిలిప్ ప్రమాణస్వీకారం చేశారు. ఇప్పటి వరకు రాజుగా ఉన్న ఆల్బర్ట్-2 పదవీ బాధ్యతల నుంచి తప్పుకుని తన పెద్ద కుమారుడు ఫిలిప్ కు అధికార పగ్గాలు అప్పగించాడు. దీంతో ఇక నుంచి బెల్జియం దేశానికి ఫిలిప్ రాజుగా వ్యవహరించనున్నాడు. రాచరికపు బెల్జియంలో జరిగిన ఈ కార్యక్రమానికి రాజకుటుంబంతో పాటు దేశ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.