: ఆగస్టు 1 న తెలంగాణ కోసం ఇందిరా పార్కువద్ద ధర్నా: కోదండరాం
తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలన్న డిమాండ్ తో ఆగస్టు 1 న హైదారాబాద్ లోని ఇందిరా పార్కువద్ద ధర్నా చేయనున్నామని టీజేఏసీ కన్వీనర్ కోదండరాం తెలిపారు. సంగారెడ్డిలో టీఎన్జీవో సంఘం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఏర్పాటుకు వెంటనే చర్యలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం ఏర్పాటు చేయకుంటే కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను గ్రామాల్లో తిరగనిచ్చేది లేదని హెచ్చరించారు.