: బ్యాట్ మ్యాన్-సూపర్ మ్యాన్ డిష్షు డిష్షుం
బ్యాట్ మ్యాన్, సూపర్ మ్యాన్ సినిమాలంటే చాలు పిల్లలు, యువత అవి వీక్షించడానికి ఉత్సాహం చూపిస్తారు. వీరి సినిమా ఏదొచ్చినా సరే వీళ్లకి పండగే. అలాంటిది వీరిద్దరూ కలిసి నటిస్తే, ఈ ఇద్దరూ కలిసి వెండి తెరమీద డిష్షుం డిష్షుం అని ఫైట్లతో ధియేటర్ ని హోరెత్తిస్తే... ఇక ఆ సినిమాకు కాసుల వర్షమే! అలాంటి ఆలోచనే జాక్ స్నైడెర్న్ కు వచ్చింది. ఇతను ఐరన్ మేన్ సినిమాల దర్శకుడు. ఇతని తాజా సినిమా 'మేన్ ఆఫ్ ది స్టీల్' అభిమానులను అలరిస్తోంది. కాగా కొత్తసినిమాకు ప్రస్తుతం స్క్రిప్టు వర్కు జరుగుతోంది. అన్నీ అనుకూలిస్తే 2015 నాటికి ధియేటర్లలో బ్యాట్ మ్యాన్, సూపర్ మ్యాన్ కలిసి సందడి చేసే అవకాశముందని జాక్ స్నైడెర్న్ శాన్ డీగోలో తెలిపాడు.