: పంచాయతీలను నిర్వీర్యం చేసింది కాంగ్రెస్సే: చంద్రబాబు


పంచాయతీలను కాంగ్రెస్ పార్టీ నిర్వీర్యం చేసేసిందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. హైదరాబాదులోని ఆ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, మంచి సర్పంచి విజయం సాధిస్తేనే గ్రామాలు సురక్షితంగా ఉంటాయని అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో నిజాయతీ ఉన్న వ్యక్తులను సర్పంచులుగా ఎన్నుకోవాలని ప్రజలకు బాబు సూచించారు. గ్రామ సచివాలయాలను నామరూపాల్లేకుండా చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందన్నారు. 64 అధికారాలతో గ్రామ సచివాలయాన్ని టీడీపీ బలోపేతం చేస్తే కాంగ్రెస్ దానిని నాశనం చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ వ్యవహారశైలి కారణంగా ఇప్పుడు గ్రామ సమస్యలను పట్టించుకునే నాధుడే కరవయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఏకగ్రీవాలపై తాము జాబితా విడుదల చేసేందుకు సిద్ధమని, కాంగ్రెస్, వైఎస్సార్ సీపీలు సిద్ధమేనా? అని చంద్రబాబు సవాలు విసిరారు.

  • Loading...

More Telugu News