: ఆస్ట్రేలియాలో బాంబులేసిన అమెరికా!


ఆస్ట్రేలియాలో అమెరికా బాంబులేసిందని కాన్ బెర్రాలోని ఆ దేశ ప్రధాని కార్యాలయం అధికారిక ప్రకటన విడుదల చేసింది. అయితే దానికి అమెరికా వివరణ ఇచ్చింది. అమెరికాకు చెందిన రెండు యుద్ధవిమానాలు ఆస్ట్రేలియాలోని గ్రేట్ బారియర్ రీఫ్ ప్రాంతంలోని మెరైన్ పార్కులో నాలుగు బాంబులను వదిలాయి. శిక్షణలో ఉన్న యుద్ధవిమానాల వల్ల ఈ పొరబాటు జరిగిందని పేర్కొంది. పగడపు దీవి ప్రక్కన నీటిలో పడేలా బాంబులు వేయడంతో ఈ నాలుగు బాంబులు కూడా పేలలేదు. కాగా, మెరైన్ పార్కు ప్రపంచ హెరిటేజ్ ప్రాంతాల్లో ఒకటి.

వాస్తవానికి అమెరికా యుద్ధవిమానాలు బాంబింగ్ రేంజ్ లో ఉన్న వేరే దీవిపై ఈ బాంబులు వేయాల్సి ఉంది. చివరి నిమిషంలో ఆ ప్రాంతంలో ఏవో ఆటంకాలు ఉన్నాయని ఈ బాంబులు మెరైన్ పార్కువద్ద వేయాల్సి వచ్చిందని సమాచారం. అయితే సాధ్యమైనంత వరకు ముప్పు తప్పించే ప్రయత్నంలోనే బాంబులు నీటిలో వదిలామని అమెరికా అధికారులు చెబుతున్నారు. కానీ, ఎక్కడో ఒక చోట విడిచే బదులుగా సముద్రంలోనే విడిచేయొచ్చుకదా? దీవి దగ్గరే ఎందుకు బాంబులు వదలాల్సి వచ్చిందని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.

  • Loading...

More Telugu News