: ఇప్పటికీ అంబాసిడరే కేక!


మారుతీ, హ్యుండయ్, టయోటా, హోండా... ఇలా ఎన్ని కార్ల కంపెనీలు మార్కెట్ లోకి వచ్చినా దేశీయ కారు అంబాసిడర్ ను మాత్రం ఆ స్థానం నుంచి తప్పించలేకపోతున్నాయి. 70, 80 దశకాల్లో భారతీయ కార్ల రంగానికి ఏకఛత్రాధిపత్యం వహించిన అంబాసిడర్ కారు ఇప్పటికీ ప్రపంచంలో ఉత్తమ ట్యాక్సీగా 'టాప్ గేర్' ఓటింగ్ లో నిలిచింది. బీబీసీ ఛానల్ లో వచ్చే టాప్ గేర్ కార్యక్రమం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రిచర్డ్ హ్యామండ్ ప్రపంచ వ్యాప్తంగా సర్వే నిర్వహించారు. అందులో అన్ని వాహనాల పోటీని తట్టుకుని భారతీయ అంబాసిడర్ విజేతగా నిలిచింది. మోరిన్ ఆక్స్ ఫర్డ్ గా బ్రిటన్ లో ప్రారంభమై హిందూస్థాన్ అంబాసిడర్ గా పేరు మార్చుకున్న ఈ కారు, 80 వ దశకం సగంలో మారుతీ కారు రంగప్రవేశం వరకు రారాజుగా నిలిచింది. ఈ కార్లను పశ్చిమ బెంగాల్ లోని హుగ్లీలో సీకే బిర్లా గ్రూప్ హిందూస్థాన్ మోటార్స్ లిమిటెడ్ ఉత్పత్తి చేస్తుంది.

  • Loading...

More Telugu News