: పెళ్లి వివాదంలో సినీ నటి


కన్నడ నటి శ్రుతికి రెండో పెళ్లి విషయంలో ఎదురు దెబ్బ తగిలింది. ఆమె రెండో భర్త, పాత్రికేయుడు చంద్రచూడ్ చక్రవర్తి తమ వివాహాన్ని రద్దు చేయాలంటూ శనివారం బెంగళూరు కోర్టును ఆశ్రయించారు. చంద్రచూడ్ తనకు విడాకులివ్వకుండా నటి శ్రుతిని పెళ్లి చేసుకుని ఆమెను, తనను మోసం చేశాడంటూ అతని మొదటి భార్య మంజుల ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. దీంతో కోర్టు శ్రుతి, చంద్రచూడ్ లను తమ ముందు హాజరుకావాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా కోర్టుకు హాజరైన చంద్రచూడ్ తమ వివాహాన్ని రద్దు చేయాలంటూ కోర్టులో లిఖితపూర్వకంగా విజ్ఞప్తి చేశారు. కేసును కోర్టు ఆగస్టు 23కు వాయిదా వేసింది.

  • Loading...

More Telugu News