: సంజయ్ దత్ కు హైబీపీ
పూణెలోని ఎరవాడ జైలులో ఖైదీగా శిక్ష అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. నిన్న జైలులో వైద్యులు నిర్వహించిన పరీక్షల్లో ఇది తెలిసింది. దీంతో సంజయ్ కు వైద్యులు మందులు సూచించారు. భద్రతా కారణాల వల్ల సంజయ్ దత్ ను ఆస్పత్రికి తీసుకెళ్లే అవకాశం లేక జైలులోనే పరీక్షలు నిర్వహించినట్లు జైలు అధికారులు తెలిపారు.