: 40 లంక గ్రామాలను ముంచెత్తిన వరద
గోదావరి ఉద్ధృత ప్రవాహంతో కోనసీమలోని 40 లంక గ్రామాలు మునిగిపోయే పరిస్థితి నెలకొంది. వరద నీటిలో చిక్కుకుపోయిన 1300 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రవాహం ఇంకా పెరిగితే ఇవి పూర్తిగా నీట మునిగే ప్రమాదం ఉంది. దీంతో స్థానిక ప్రజలు భయాందోళన మధ్య గడుపుతున్నారు. మరోవైపు భద్రాచలం డివిజన్, కూనవరం మండలంలో 200 ఇళ్లు నీటమునిగాయి.