: పీసీసీ కార్యదర్శిగా మంత్రిగారి తనయుడు
రాష్ట్ర మంత్రి గల్లా అరుణ కుమారి తనయుడు గల్లా జయదేవ్ నేడు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా నియమితుడయ్యాడు. జయదేవ్ నియామకంతో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుందని పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ అన్నారు. గాంధీభవన్ లో జరిగిన ఓ కార్యక్రమంలో బొత్స.. జయదేవ్ కు నియామక పత్రం అందించారు.