: ఢిల్లీలో భారీ వర్షాలు.. స్థంభించిన జనజీవనం


భారీగా కురుస్తున్న వర్షాలతో దేశ రాజధాని ఢిల్లీ జలమయం అయింది. రోడ్లకు ఇరువైపులా నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారింది. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధాన ప్రాంతాలైన ఐటిఓ, లక్ష్మీ నగర్, మోతి బాగ్, కాశ్మీరీ గేట్, ముర్కా, ద్వారకా, దౌలా కౌన్ ప్రాంతాల్లో నీటి ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో ట్రాఫిక్ నిర్వహణ కష్టసాధ్యమయింది. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి చేరుకోవటానికి గంటల తరబడి సమయం పడుతోందని ఢిల్లీ వాసులు వాపోతున్నారు.

  • Loading...

More Telugu News