: కామెంటేటర్ అవతారంలో వీవీఎస్ లక్ష్మణ్


గత ఏడాది అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన దిగ్గజ బ్యాట్స్ మన్ వీవీఎస్ లక్ష్మణ్ ఇప్పుడు మరో అవతారంలో కనిపించనున్నాడు. రేపటి నుంచి మొదలయ్యే భారత్-ఆస్ట్రేలియా తొలి టెస్టులో కామెంటేటర్ గా వ్యవహరించనున్నాడు. ఈ మేరకు స్టార్ స్పోర్ట్స్ చానెల్ తో ఒప్పందం కుదిరినట్టు తెలుస్తోంది. కాగా, ఈ నాలుగు టెస్టుల సిరీస్ కు లక్ష్మణ్ తో పాటు గవాస్కర్, రవి శాస్త్రి, కపిల్ దేవ్, బోర్డర్, షేన్ వార్న్, హేడెన్ తదితరులు వ్యాఖ్యాతలుగా సేవలందించనున్నారు.

  • Loading...

More Telugu News