: '108' ను అడ్డుకున్న విశాఖ ఉద్యోగులు
విశాఖపట్నంలో '108' ఉద్యోగుల సమ్మె కొనసాగుతోంది. ప్రభుత్వంతో చర్చలు విఫలమవ్వడంతో '108' ఉద్యోగులు సమ్మెను విరమించలేదు. దీంతో అధికారులు కొత్త వారితో '108' వాహనాలు నడిపేందుకు ప్రయత్నించారు. దీంతో ఇంతకాలం తాము సేవలందించినా తమకు గుర్తింపు లేదని, 'మీరు చేసినా గుర్తింపు ఉండదు' అంటూ ఆ వాహనాలకు అడ్డుపడ్డారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకుని అరెస్టు చేశారు. తమ సమస్యలు పరిష్కరించకుండా '108' వాహనాలు నడపాలని చూస్తే ఆందోళన ఉధృతం చేస్తామన్నారు.