: ఆ వీడియోలు లీక్ చేయకుండా చూడండి: యుక్తాముఖి


బాలీవుడ్ నటి యుక్తాముఖి, ప్రిన్స్ తులి వైవాహిక బంధం ఇక ముడిపడని స్థాయికి చేరుకుంది. తనకు సంబంధించిన రహస్య వీడియోలు భర్త తులి వద్ద ఉన్నాయని, వాటిని బయటపెట్టకుండా సీజ్ చేయాలని యుక్తాముఖి తరఫున ఆమె లాయర్ తౌబాన్ ఇరాని ముంబైలోని కోర్టును అభ్యర్థించారు. వాటిని ప్రిన్స్ తులి లీక్ చేసే ప్రమాదముందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. అదే జరిగితే ఆమె గౌరవానికి భంగకరమని చెప్పారు. తనను శారీరకంగా, మానసికంగా వేధించాడంటూ భర్త తులి, అతని కుటుంబ సభ్యులపై యుక్తాముఖి ముంబైలోని అంబోలా పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రిన్స్ యాంటిసిపేటరీ బెయిల్ కోసం స్థానిక కోర్టులో పిటిషన్ దాఖలు చేసుకున్నారు.

ప్రిన్స్ కు బెయిల్ మంజూరు చేయరాదని యుక్తాముఖి లాయర్ తౌబాన్ కోరారు. భర్త నుంచి వేరుపడిన ఏడాది తర్వాత కేసు దాఖలు చేయడంలో అర్థమేంటి? అంటూ ప్రిన్స్ తరఫు లాయర్ సందేహం వ్యక్తం చేశారు. అలాగే, తన భర్త స్వలింగ సంపర్కుడంటూ యుక్తాముఖి ఆరోపించారని, దానిని నిరూపించే సాక్ష్యాలు లేవన్నారు. పోలీసుల విచారణకు సహకరిస్తున్నందున బెయిల్ మంజూరు చేయాలని కోరారు.

  • Loading...

More Telugu News