: రెండు గంటలు నిర్బంధించి, 5 సార్లు అత్యాచారం చేసిన కంప్యూటర్ టీచర్
కంప్యూటర్ టీచర్ ఓ యువతిని రెండు గంటల పాటు నిర్బంధించి 5 సార్లు అత్యాచారానికి పాల్పడిన ఘటన ముంబైలో వెలుగులోకి వచ్చింది. తూర్పు ముంబైలోని డంబివోలి ప్రాంతంలోని పిశ్వాలీ గ్రామానికి చెందిన 18 ఏళ్ల కాలేజి యువతిని యువకుడైన ఓ కంప్యూటర్ టీచర్ ప్రతిరోజూ బస్ లో వెంబడించేవాడు. ఇటీవల ఆమెను ఓ ప్రాంతానికి తీసుకువెళ్లి బయటకు చెబితే చంపుతానని బెదిరించి, రెండు గంటలపాటు నిర్భంధించి, 5 సార్లు అత్యాచారం చేశాడు. అనంతరం ఆమెను విడిచిపెట్టాడు. దీంతో ఇల్లు చేరిన ఆమె జరిగిన ఘటనపై తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు.