: 'మధ్యాహ్న భోజనం' నిధులను కేంద్రానికి తిరిగిచ్చేసిన బీహార్


మధ్యాహ్న భోజనం పథకం కింద ఇచ్చిన రూ. 463 కోట్లను బీహార్ ప్రభుత్వం కేంద్రానికి తిరిగిచ్చేసింది. 2006-07, 2009-10 సంవత్సరాల మధ్య ఈ నిధులను కేంద్రం బీహార్ కు ప్రకటించింది. వాటిని సరిగా సద్వినియోగం చేయలేకపోతున్నామనే కారణంతో బీహార్ 'మధ్యాహ్న భోజనం' పథకం డైరెక్టర్ తిరిగి పంపారని తెలుస్తోంది.

తాజాగా ఇక్కడి చాప్రాలోని ఓ పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిని దాదాపు 22 మంది విద్యార్ధులు మరణించిన సంగతి తెలిసిందే. దాంతో, ప్రభుత్వ ఆడిటర్లు ఒక్కసారే దాడులు చేసి నిధులను ఎలా ఖర్చు పెడుతున్నారంటూ ప్రశ్నించారు. అందుకే, కేంద్రం ఇచ్చిన ఈ నిధులను వెనక్కి పంపిస్తున్నట్లు సమాచారం. మరోవైపు మధ్యాహ్న భోజనం వికటించిన ఘటన నేపథ్యంలో 90 మందిపై ఎఫ్ఐఆర్ నమోదైంది.

  • Loading...

More Telugu News