: మరో 48 గంటల పాటు రాష్ట్రంలో వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం స్థిరంగా కొనసాగుతున్న కారణంగా రాష్ట్రంలో మరో 48 గంటల పాటు వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా కోస్తా, తెలంగాణ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. కోస్తా తీరం వెంబడి 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.