: అమ్మ కావాలనుకుంటున్న హాలీవుడ్ ముద్దుగుమ్మ


హాలీవుడ్ నటి లిండ్సే లోహాన్ తల్లి కావాలనుకుంటోంది. అనుకున్నదే తడవుగా వీర్యదాతల కోసం వెతుకులాట మొదలు పెట్టింది. 26 ఏళ్ల లిండ్సే లోహాన్ ప్రస్తుతం కాలిఫోర్నియాలోని మలిబు ప్రాంతంలో ఉన్న క్లిఫ్ సైడ్ పునరావాస కేంద్రంలో ఉంటోంది. తన స్నేహితుల్లో ఎవరైనా వీర్యదాత ఉన్నారేమోనని వాకబు చేసినట్టు డైలీస్టార్ కో యూకే వెబ్ సైట్ తెలిపింది. కాగా ఓ బిడ్డను ఈ లోకంలోకి తెచ్చే ముందు నీ గురించి నువ్వు జాగ్రత్తగా చూసుకో అని ఓ మిత్రుడు సలహా ఇచ్చాడట. దీంతో పునరావాసం పూర్తయిన తరువాత న్యూయార్క్ లో ఓ దుకాణం తెరవాలనుకుంటోందట. ఓప్రా విన్ ఫ్రే నెట్ వర్క్ కు చెందిన ఓ డాక్యుమెంటరీలో కూడా నటించనుంది. అది వచ్చే ఏడాది ప్రసారం కానుంది. తన కోరిక నెరవేరకపోవడంతో లిండ్సే లోహన్ వీర్య దాతకోసం ఎదురుచూపులు చూస్తోంది.

  • Loading...

More Telugu News