: మెట్రో రైలు పట్టాలెక్కేందుకు ఇంకా రెండేళ్ళ సమయం


హైదరాబాద్ లో మెట్రో రైలు సేవలు అందుబాటులోకి వచ్చేందుకు ఇంకా రెండేళ్ళ సమయం పట్టనుంది. 2015 నాటికి మెట్రో రైలు పట్టాలెక్కుతుందని 'ఎల్ అండ్ టీ' మెట్రోరైలు మేనేజింగ్ డైరెక్టర్ వీబీ గాడ్గిల్ తెలిపారు. నాగోల్ నుంచి మెట్టుగూడ వరకు జరుగుతున్న మెట్రో నిర్మాణ పనులను ఆయన ఈ రోజు పర్యవేక్షించారు. అధునాతన పరిజ్ఞానంతో మెట్రోరైలు ట్రాక్ పనికి శ్రీకారం చుడుతున్నట్టు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ట్రాక్ నిర్మాణంలో ఫ్రాన్స్ నుంచి దిగుమతి చేసుకున్న చెక్ రైల్స్ ను ఉపయోగించనున్నట్టు వెల్లడించారు. నిర్మాణంలో ట్రాక్ మాస్టర్ అనే నూతన పరికరాన్ని ఉపయోగిస్తున్నట్టు తెలిపారు. ట్రాక్ నాణ్యత, కొలతలను కచ్చితంగా నిర్ధారించేందుకు ఈ పరికరం ఉపయోగపడుతుందని గాడ్గిల్ చెప్పారు. త్వరలో మెట్రోరైలు పేరిట ఓ మ్యూజియం ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు.

  • Loading...

More Telugu News